RRR Movie: ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ను వేధిస్తున్న ప్రశ్న ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, నందమూరి ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని జనవరి 7వ తేదీ విడుదల చేయాలని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కానీ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాని మార్చి 18 లేదా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. ఇలా రెండు తేదీలు ప్రకటించడంతో అభిమానులు కాస్త గందరగోళంలో ఉన్నప్పటికీ ఈసారైనా ఈ సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేస్తారా అనే అనుమానంలో ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్నో పాటలు టీజర్లు విడుదల చేయడంతో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరో పాత్రలో నటించగా రామ్ చరణ్ సరసన సీత పాత్రలో అలియా భట్ నటిస్తుంది. అదేవిధంగా ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అయితే ఈమె నిన్న (జనవరి 29)పుట్టిన రోజు జరుపుకోవడంతో చిత్రబృందం ఈమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈమె ఒక బ్రిటిష్ యువతి పాత్రలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాలో అలియా భట్ పాత్రను ఎంతో హైలెట్ చేసి చూపించారు.

కానీ ఒలీవియాను మాత్రం పెద్దగా ఎక్స్పోజ్ చేయలేదు. అదేవిధంగా ట్రైలర్లో కూడా ఈమె గురించి పెద్దగా చూపించక పోవడంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ హీరోయిన్ గురించి ఎందుకు ప్రమోట్ చేయడం లేదు అంటూ ఎంతోమంది సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది. ఈమె పాత్ర ఎన్టీఆర్ చరణ్ లకు ఎలా సహాయం చేస్తుంది అనే విషయం తెలియాల్సి ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus