RRR Premiere Shows: ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షోలు.. మన దగ్గర ఎప్పుడంటే?

అత్యధిక భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా మరొక వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయంలో ఇప్పటికే అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే ముందుగా ప్రీమియర్ షోలు.. ఫ్యాన్స్ షోలు.. ఉంటాయా లేదా అనే విషయంలో అభిమానులలో అయితే చాలా సందేహాలు ఉన్నాయి.

ఈ విషయంపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు చాలాసార్లు చర్చలు జరిపారు. కానీ ఇంకా అఫీషియల్ గా ఇలాంటి విషయాన్ని చెప్పలేదు. ఇక ఇటీవల దర్శకుడు రాజమౌళి నిర్మాత డివివి దానయ్య ఈ ఇద్దరు కూడా డిస్ట్రిబ్యూటర్ లతో కలిసి ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక సినిమాను జనవరి 7వ తేదీన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఒక రోజు ముందుగానే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడతాయి.

అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోలు ప్రదర్శించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. వీలైనంత వరకు ఇండియాలో అయితే ప్రీమియర్ షోలకు ఒకేసారి మొదలుపెట్టాలి అని అనుకుంటున్నారట. జనవరి 6వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫ్యాన్స్ షోలు ప్రీమియర్ షోలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ షోల రేట్లు ఎలా ఉంటాయి అనే విషయంలో కూడా అందరూ చర్చలు జరిపుతున్నట్లు సమాచారం.

అభిమానులు తప్పకుండా మొదటి షో చూడాలి అని ఎంతవరకైనా వెళ్తారు కాబట్టి ఒక్క టికెట్ రేటు వెలల్లోనే ఉండే అవకాశం ఉంది. మరి ఆ విషయం పై చిత్రం యూనిట్ సభ్యులు ఇంకా ఎప్పుడు అఫీషియల్ గా క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇక తెలుగులో ప్రీ రిలీజ్ వేడుక కాకుండా విడుదల అనంతరం విజయోత్సవ సభను నిర్వహించే అవకాశం ఉందట.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus