దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కకేస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ RRR కోసం సినీ లోకం ఏ స్థాయిలో ఎదురుచూస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తప్పకుండా సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే సినిమా విడుదలపై గత ఏడాది నుంచి సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిన.
ఇటీవల దర్శకుడు రాజమౌళి ఫైనల్ గా 2022 జనవరి 7న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జక్కన్న తీసుకున్న ఈ నిర్ణయంపై సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసుకున్న ఇతర సినిమాల నిర్మాతలు ఏ మాత్రం సంతృప్తిగా లేరని తెలుస్తోంది. అసలు రాజమౌళి RRR సినిమాకు పండగ సీజన్స్ తో అవసరం ఏముంది. అలాంటి మల్టీస్టారర్ సినిమా ఏ సీజన్ లో వచ్చినా కూడా మంచి కలెక్షన్స్ అందుకుంటుంది. అలాంటిది ఆయన తొందర ఎందుకు పడుతున్నారో అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
అయితే రాజమౌళి మాత్రం ఆ విషయంలో అస్సలు వెనక్కి తగ్గకుండా సంక్రాంతికి అందరికంటే ముందే రాబోతున్నట్లు అఫీషియల్ గా డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. ముందుగా అసలు ఆ సీజన్ లో ఏ సినిమాలు ఉన్నాయి అనే విషయం గురించి కూడా అస్సలు ఆలోచించ లేదట. ఇక జక్కన్న వెనక్కి తగ్గేలా లేడని మిగతా సినిమాల నిర్మాతలు ముందుగానే ఉహించారు. ఇక ఫైనల్ గా డేట్ ఎనౌన్స్ చేయడంతో వారు పోటీ నుంచి వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.