RRR Movie Promotions: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ఖర్చు అన్ని కోట్లా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ఈసారి ఖచ్చితంగా జనవరి 7వ తేదీన రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్నో హై బడ్జెట్ సినిమాలు తెరకెక్కాయనే సంగతి తెలిసిందే. బాహుబలి2 సినిమాను మించి ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్లను సాధించాలనే ఉద్దేశంతో జక్కన్న ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్ కోసమే జక్కన్న 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కనీసం 1,000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడమే లక్ష్యంగా రాజమౌళి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ సినిమా ఆ స్థాయిలో కలెక్షన్లని సాధిస్తుందా? లేదా? తెలియాలంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సిందే. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ జరగనున్న నేపథ్యంలో నిర్మాత దానయ్య ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది. ​ఈ సినిమా ప్రమోషన్స్ కొరకు స్పెషల్ ఛార్టెడ్ ఫ్లైట్స్ ను కూడా వినియోగించనున్నారని సమాచారం. సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ చేయనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ కోసం భారీ సెట్లను, భారీ ఎల్ ఈడీ స్క్రీన్లను వాడబోతున్నారని తెలుస్తోంది. 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ లకు కూడా ఈ సినిమా వల్ల క్రేజ్ పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. కరోనా వల్ల ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలు పెరిగిందని తెలుస్తోంది

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus