RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం… చిన్న వ్యవహారం కాదట!

సినిమాకి కథ, కథనం, నటులు, సాంకేతిక నిపుణులు, డబ్బులు ఎంత ముఖ్యమో… పబ్లిసిటీ కూడా అంతే ముఖ్యం. బంగారం లాంటి సినిమా చేసినా… దానికి తగ్గ ప్రచారం చేయకపోతే నిరుపమోగమే. గతంలో కొన్ని సినిమాలు ఇలా సరైన ప్రచారం చేయక ప్రేక్షకుల్లోకి వెళ్లలేకపోయాయి. పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా చేస్తున్నప్పుడు అయితే ఆ ప్రచారం ఇంకా డబుల్‌ అవ్వాలి. ఇలాంటి ప్రచారం చేయడానికి టైమ్‌ లేకే ‘పుష్ప’ టీమ్‌ ఇబ్బంది పడింది అని చెప్పొచ్చు. అయితే ‘ఆర్‌ఆర్ఆర్‌’ ఈ విషయంలో సక్సెస్‌ అయ్యింది అనాలి. అయితే ఆ సినిమా ప్రచార బడ్జెట్‌తో ఓ మధ్యస్థమైన సినిమా తీసేయొచ్చు అంటున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం సంగతి చూస్తే… తెలుగులో వరుస ప్రచారాలు చేశారు. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో ప్రచారం మొదలుపెట్టారు. సినిమా ప్రచారం పూర్తిగా కిక్‌ స్టార్ట్‌ చేయకముందే ముంబయిలో పీవీఆర్‌ వాళ్లతో కలిపి ఓ ఈవెంట్‌ చేశారు. అయితే ట్రైలర్‌ లాంచ్‌ నుండే ప్రచారం జోరందుకుంది. దీని కోసం ఇప్పటి వరకు నిర్మాతకు రూ. 20 కోట్ల నుండి రూ. 25 కోట్ల వరకు ఖర్చయి ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కారణం ప్రతి విషయంలో భారీతనం చూపిస్తుండటమే అని టాక్‌.

ముంబయిలో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ కోసం తెలుగు రాష్ట్రాల నుండి మూడు వేల మంది అభిమానుల్ని తీసుకెళ్లారు. అక్కడ వాళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత వాళ్లను తిరిగి సొంతూళ్లకు తీసుకొచ్చారు. ఆ తర్వాత దక్షిణాదిలో జరిగిన వివిధ కార్యక్రమాలకు కూడా ఇలాంటి ఏర్పాట్లే చేశారు. అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈవెంట్ ఎక్కడ జరిగినా… అక్కడ రామ్‌చరణ్‌, తారక్‌ గురించి కేకలు, ఈలలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ‘ఆర్‌ఆర్ఆర్‌’ హీరోలకు అక్కడ ఆ స్థాయి ఆదరణ లేదనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ ఫ్యాన్స్‌ సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ కార్యక్రమాలకు కేవలం రాజమౌళి, రామ్‌చరణ్‌, దానయ్య, ఎన్టీఆర్‌ మాత్రమే వెళ్లడం లేదు. వాళ్లతోపాటు పెద్ద టీమే తిరుగుతోంది. హీరోల వ్యక్తిగత సహాయకులు, సినిమా బృందం, రాజమౌళి టీమ్‌ ఇలా చాలామందే తిరుగుతున్నారు. వీరి కోసం ప్రత్యేక విమనాలు, బస్సులు, బస లాంటివి కూడా లెక్కలోకి తీసుకోవాలి. అలా వీటి కోసం కోట్లలో ఖర్చు అయ్యిందట. ఆ బడ్జెట్ లేకపోతే సినిమా ప్రచారం ఆ రేంజిలో ఉండదనేది కాదనలేని విషయం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus