RRR Movie: ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఎంపికైన ‘ఆర్.ఆర్.ఆర్’

  • October 26, 2022 / 05:18 PM IST

ఆస్కార్ పరంగా నిరాశపరిస్తే ఏంటి…! ‘ఆర్ఆర్ఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. విషయంలోకి వెళితే… అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డు ఈ ఏడాది ‘ఆర్.ఆర్.ఆర్’ కి దక్కడం విశేషంగా చెప్పుకోవాలి.అది కూడా ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరిలో ఈ అవార్డు లభించడం గర్వించే అంశం. ఈ విషయం పై దర్శకుడు రాజమౌళి ఓ వీడియో ద్వారా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. “బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో మా ‘ఆర్.ఆర్.ఆర్’ కు అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది.

మా టీమ్ తరఫున జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ‘బాహుబలి – 2’ తర్వాత నాకు వచ్చిన రెండో శాటర్న్ అవార్డు ఇది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనాలనే ఆశ నాకు ఉంది. కానీ..మా ‘ఆర్.ఆర్.ఆర్’ జపాన్లో రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఆ దేశంలో వివిధ ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండడం వలన హాజరుకాలేకపోయాను. విజేతలందరికీ ఈ సందర్భంగా నా అభినందనలు తెలుపుకుంటున్నాను” అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ వంటి ఇద్దరు సూపర్ హీరోల పాత్రలను తీసుకుని వాటికి ఫిక్షన్ ఓడించి తీర్చిదిద్దిన కథ ‘ఆర్.ఆర్.ఆర్’. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు.అజయ్ దేవగన్, శ్రీయ, అలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ వంటి స్టార్లు ఈ చిత్రంలో నటించారు.

ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి హాలీవుడ్ స్టాండర్డ్స్ కు తగ్గని మ్యూజిక్ ని అందించారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.1150 కోట్ల భారీ వసూళ్లను సాధించి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. ఇక ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరిలో శాటర్న్ అవార్డు లభించడం పట్ల అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus