RRR Release Date: ఆ రూమర్లకు చెక్ పెట్టబోతున్న జక్కన్న!

మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడుతుందని ప్రేక్షకులు భావిస్తున్న తరుణంలో రాజమౌళి అతని టీం మాత్రం అక్టోబర్ 13వ తేదీనే మూవీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన సంస్థల నుంచి ఒత్తిడి ఉండటం వల్లే ఆర్ఆర్ఆర్ టీమ్ దసరాకు రిలీజ్ చేస్తామని చెబుతుందని ఆ తేదీకి ఈ మూవీ రిలీజ్ కావడం కష్టమని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే రిలీజ్ డేట్ మారుతున్నట్టు వస్తున్న వార్తల వల్ల రాజమౌళి హర్ట్ అయ్యారని సమాచారం. మరోసారి ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ గురించి కన్ఫర్మ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రిలీజ్ డేట్ తో పాటు సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలను రాజమౌళి వెల్లడించనున్నారని సమాచారం. గతేడాది అక్టోబర్ నాటికి దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది.

అక్టోబర్ నాటికి కరోనా కంట్రోల్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీపై మెల్లిగా అంచనాలు పెంచుతున్న జక్కన్న రిలీజ్ నాటికి ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన సినిమా కావడంతో థియేటర్లలో ఈ సినిమాను చూస్తే పొందే అనుభూతే వేరని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ను సినిమా రిలీజ్ కు నెలరోజుల ముందు రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus