టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాలలో RRR సినిమా నెంబర్వన్ స్థానంలో ఉంది. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని కూడా ఇప్పటికే బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమా మొదటి రోజే ఈజీగా 100 కోట్ల వసూళ్లను అందుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటికే అయిదుసార్లు వాయిదా పడిన ఈ సినిమా మార్చి 25 వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ బలంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే తప్పకుండా ఈ సారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటుంన్నారు. అయితే గతంలో సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నప్పుడు ప్రమోషన్స్ కోసం దాదాపు 35 కోట్ల వరకు ఖర్చు చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఈసారి ప్రమోషన్స్ కోసం మరింత కష్టపడేందుకు సిద్ధమైంది. ఇక ఈసారి దుబాయ్ లో భారీ స్థాయిలో ఈవెంట్ ను నిర్వహించాలని అనుకుంటున్నారట. గతంలోనే సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నప్పుడు దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు.
కానీ కరోనా కారణంగా అప్పట్లో వెనుకడుగు వేయక తప్పలేదు. ఇక ఫైనల్ గా మార్చి 17వ తేదీన లేదా 20వ తేదీన బుర్జ్ ఖలీఫా లో ఐనిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ను నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలో ఉన్నాయి. అంతే కాకుండా వివిధ దేశాల్లో కూడా సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. కాబట్టి బుర్జ్ కలీఫాలో సినిమా ఈవెంట్ ను నిర్వహిస్తే తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా సినిమాకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈవెంట్ కోసం నిర్మాత డి.వి.వి.దానయ్య ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. మరి ఆ ప్లాన్ ని ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సినిమా వేడుకలో కేవలం చిత్ర యూనిట్ సభ్యులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉందట.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!