RRR, Radhe Shayam: మరో ట్రైలర్ కావాలంటున్న ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్.. కానీ?

ఈ ఏడాది రిలీజ్ కానున్న భారీ బడ్జెట్ సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటనే సంగతి తెలిసిందే. మార్చి నెల 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు రెండు వారాల గ్యాప్ లో రిలీజ్ కానుండగా వందల కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు హిట్ అనిపించుకుంటాయి.

అయితే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల నిర్మాతలు రెండు ట్రైలర్స్ ను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ పై విమర్శలు వ్యక్తం కాగా ఈ సినిమా మేకర్స్ రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ సినిమా మేకర్స్ సైతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. మార్చి నెల 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రాధేశ్యామ్ సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కానుంది.

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి కూడా మరో ట్రైలర్ విడుదలైతే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ ట్రైలర్ లో కథ గురించి ఎలాంటి క్లారిటీ రాకుండా మేకర్స్ జాగ్రత్తపడ్డారు. కథ గురించి క్లారిటీ వచ్చేలా మేకర్స్ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గతంలో పలు సినిమాల కథలను రిలీజ్ కు ముందే రివీల్ చేసిన జక్కన్న ప్రస్తుతం తన సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఆ విషయంలో రూటు మార్చారు.

ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ భారీస్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటే మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus