మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నిలిచిన సంగతి తెలిసిందే. మరో ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా టికెట్ రేట్లకు ఏపీ నుంచి కూడా అనుకూల ప్రకటన వెలువడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అనుకూల ప్రకటన రాని పక్షంలో ఏపీ బయ్యర్లకు మాత్రం భారీ మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తెలంగాణ సర్కార్ జీవో నంబర్ 120ను ప్రవేశపెట్టడం హర్షించదగిన విషయమని తెలిపింది.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు చిన్న సినిమాలకు మాత్రం తక్కువ ధరలకే టికెట్లను అమ్మాలని సూచనలు చేశారు. భారీ బడ్జెట్ సినిమాలకు గరిష్ట ధరలను మూడు వారాల పాటు అమ్మి ఆ తర్వాత రేట్లు తగ్గించాలని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఏషియల్ సునీల్ మాట్లాడుతూ టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో ఓటీటీకే ఓటు అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారని అన్నారు. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ఎగ్జిబిటర్లే ఎక్కువగా నష్టపోయారని ఏషియన్ సునీల్ చెప్పుకొచ్చారు.
మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని కష్టాలను అర్థం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం ఆనందించదగిన విషయమని ఏషియన్ సునీల్ వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన ఛాన్స్ ను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని తమకు తెలిసిందని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు వెల్లడించారు. టికెట్ ధరలను పెంచిన వాళ్లు రేపటినుంచి తగ్గిస్తారని ఏషియన్ సునీల్ పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర 295 రూపాయలుగా ఉంటుందని సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర 175 రూపాయలుగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
థియేటర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఇప్పటికే సూచనలు చేశామని ఏషియన్ సునీల్ అన్నారు. నిబంధనలు పాటించని థియేటర్లను సీల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని ఏషియన్ సునీల్ అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అంచనాలకు మించి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!