RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓటీటీలో వస్తే.. కొంప మునిగినట్టే..?

టాలీవుడ్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాహుబలి అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి తెరపైకి తీసుకు రాబోతున్న ఈ మూవీపై అన్ని భాషల్లో కూడా అంచనాలు అకాశాన్ని దాటేశాయి. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే హిందీలో సినిమా అనుకున్నంతగా కలెక్షన్స్ సాధిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చాలా చోట్ల ఇంకా జనాలు థియేటర్స్ వరకు రావడం లేదు.

ఓమిక్రాన్ దెబ్బకి మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లో మళ్ళీ లాక్ డౌన్ ఛాయలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే థియేటర్స్ కేవలం 50% ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇక వీలైనంత వరకు డేంజర్ జోన్ లో థియేటర్స్ షాపింగ్ మాల్స్ ను కొన్నాళ్లు మూసి వేయడమే మంచిది అనేలా అధికారులు హెచ్చరికలు పంపుతున్నారు. అయితే ఈ క్రమంలో పే పర్ వ్యూ పద్ధతి చర్చల్లోకి వచ్చింది. సినిమా థియేట్రికల్ బిజినెస్ తక్కువగా ఉండే రాష్ట్రాల్లో అలా వెళితే మంచిది

అని సలహాలు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో సల్మాన్ ఖాన్ రాధే సినిమాను ఓటీటీలోనే డబ్బులు పెట్టి చూసుకునే విధంగా అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓటీటీ లో సాధారణంగా ఎలాంటి కాంటెంట్ విడుదలైన కూడా నిమిషాల్లోనే ఒరిజినల్ ప్రింట్ ను పైరసీ చేసేసి ఆన్లైన్ లో వధులుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాను అక్కడి వారి కోసం

ఓటీటీ లో డబ్బులకు విడుదల చేసినా కూడా చాలా ఈజీగా పైరసీ భూతం ఎటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం మిగతా రాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ పై పడే అవకాశం ఉంటుంది. ఎక్కడ లీక్ అయినా కూడా దేశవ్యాప్తంగా పాకిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. మరి ఈ ఓటీటీ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి. ఇక సినిమాను మిగతా రాష్ట్రాల్లో కూడా అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus