RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాను నిలిపివేయాలని అంటూ.. మరో కొత్త సమస్య

ఇండియా సినిమా హిస్టరీ లోనే బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా గా రూపొందుతున్న RRR సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించారు.

నిజజీవితంలోని స్వాతంత్ర సమరయోధుల పాత్రలను ఆధారంగా చేసుకొని ఒక కల్పిత కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది అని కూడా రాజమౌళి ధీమా వ్యక్తం చేశారు. సినిమాను స్టార్ట్ చేయడం కంటే ముందే చరిత్రను ఏ మాత్రం టచ్ చేయడం లేదని అలాగే ఆ పాత్రలను అగౌరపరిచేలా సన్నివేశాలు కూడా ఉండవని రాజమౌళి చెప్పారు. అయితే సినిమా థియేటర్స్ లోకి వచ్చేలోపు కొన్ని కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది.

సినిమాలో కొన్ని సన్నివేశాలలో అభ్యంతరకరంగా ఉన్నాయని అంతేకాకుండా చరిత్రని వక్రీకరించారని రాజకీయాల మరొకవైపు నుంచి అలాగే అల్లూరి, కొమరం భీమ్ వంశస్తుల నుంచి కూడా విమర్శలు వెలువడుతున్నాయి. రీసెంట్ గా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సినిమాలో స్వాతంత్ర సమరయోధుల పాత్రలను ఉపయోగించుకుని చరిత్రను వక్రీకరించే విధంగా సినిమాను తెరకెక్కించారని, అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ పాత్రలకు సంబంధించిన నిజజీవిత అంశాలను సినిమాలో చూపించకుండా కల్పితకథలు వక్రీకరించి చూపించడం

ఏ మాత్రం ఆమోదయోగ్యమైనది కాదు అని యువతను కూడా ఈ సినిమా పక్కదోవ పట్టించే విధంగా ఉందని ఆరోపిస్తూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను కూడా రద్దు చేయాలి అని ఆమె పిటిషన్ లో వివరణ ఇచ్చారు. మరి ఈ వివాదాలపై చిత్ర యూనిట్ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus