దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడుసార్లు ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడగా 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ సినిమాను ఖచ్ఛితంగా విడుదల చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారు. సొంత మార్కెటింగ్ స్ట్రాటజీలతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలను పెంచాలని రాజమౌళి భావిస్తున్నారు. యూఎస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 1000 స్క్రీన్ లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.
యూఎస్ లో 288 సినీమార్క్ మల్టీప్లెక్స్‌లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుందని ఈ సినిమా కోసమే ప్రతి మల్టీప్లెక్స్ లో 3, 4 స్క్రీన్లు ఉంటాయని సమాచారం. సినీమార్క్ కు మొత్తం 325 మల్టీప్లెక్స్ లు ఉండగా దాదాపుగా 90 శాతం మల్టీప్లెక్స్ లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుందని సమాచారం. గతంలో 207 మల్టీప్లెక్స్ లలో అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ కాగా ఆ సినిమా కంటే ఎక్కువ మల్టీప్లెక్స్ లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది.
ఆర్ఆర్ఆర్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాహుబలి సిరీస్ సినిమాలను మించి ఆర్ఆర్ఆర్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా బడ్జెట్ 550 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. నిర్మాతలకు విడుదలకు ముందే లాభాలను అందించిన ఆర్ఆర్ఆర్ 1,000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!