చరణ్, తారక్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ విషయంలో దాదాపుగా మార్పు లేదని సమాచారం. అయితే ఆ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో చరణ్, తారక్ అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో రేర్ రికార్డులను సొంతం చేసుకుంది. డిసెంబర్ నెల రెండో వారంలో ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ ఐదు భాషల్లో విడుదల కాగా ఈ ఐదు భాషల ట్రైలర్స్ టోటల్ వ్యూస్ ఏకంగా 150 మిలియన్లు కావడం గమనార్హం. సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ కొత్త రికార్డులను సొంతం చేసుకుంది. ఈ అరుదైన రికార్డు విషయంలో తారక్, చరణ్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ వల్ల తారక్, చరణ్ ఖాతాలో రేర్ రికార్డ్ చేరింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజైన తర్వాత ఎన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. చరణ్, తారక్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ ముందే నిర్మాతకు కళ్లు చెదిరే లాభాలను అందించింది. ఏపీలో టికెట్ రేట్లు పెరిగి 100 శాతం ఆక్యుపెన్సీకి థియేటర్లలో అనుమతులు లభిస్తే మాత్రం ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.
ఈ సినిమాలో చరణ్ కు జోడీగా అలియా భట్ నటించగా తారక్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటించారు. ఈ సినిమాతో అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అలియా భట్ పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికయ్యారని వార్తలు వస్తున్నాయి.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!