ఏమాత్రం తేడా వ‌చ్చినా.. ఇద్ద‌రి మ‌ధ్య వార్ త‌ప్ప‌దా..?

టాలీవుడ్ జ‌క్క‌న్న రాజ‌మౌళి ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా ఇరు వ‌ర్గాల మ‌ధ్య మాత్రం ఫైటింగ్ ఆగ‌డంలేదు. ఒక‌వైపు మెగా అభిమానులు మ‌రోవైపు నంద‌మూరి అభిమానులు మా హీరో తోపంటే.. మా హీరోనే తోప‌ని సోష‌ల్ మీడియా సాక్షిగా ఓ రేంజ్‌లో గొడ‌వ‌లు ప‌డుతూనే ఉన్నారు. ఒక హీరో అభిమాను వ్యూస్‌లో మేమే టాప్ అంటే, మ‌రో హీరో ఫ్యాన్స్ లైక్స్‌లో మాదే రికార్డ్ అంటూ ఒక‌రి పై మ‌రొకు కామెంట్లు చేసుకుంటున్నారు. మ‌రి హీరోల ఇంట్రో టీజ‌ర్స్ ద‌గ్గ‌రే ఈ రేంజ్‌లో వార్ జ‌రుగుతుంటే, ఇక ముందు ముందు ఈ ఇద్ద‌రి అభిమానుల మ‌ధ్య యుద్ధం ఏ రేంజ్‌లో ఉంటుందో అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఈ క్ర‌మంలో ఒక‌వైపు జూనియ‌ర్ ఎన్టీఆర్, మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ప్ర‌స్తుతం జ‌క్క‌న రాజ‌మౌళిన భ‌య‌పెడుతున్నారా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. అస‌లు రీజ‌న్ ఏంటంటే ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు హీరోలుగా రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌ను ఏలుతున్న కుటుంబాల‌లో నంద‌మూరి, మెగా కుటుంబాలు టాప్‌లో ఉంటారు. మెగా, నంద‌మూరి కాంపౌండ్ల నుండి ఇప్ప‌టికే ప‌లువురు హీరోలుగా వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇరు కుంటుబాల‌కు అభిమానులు కూడా పెద్ద ఎత్తును ఉన్నారు. త‌మ త‌మ హీరోల పై ఈగ వాల‌కుండా చూసుకోవ‌డంతో ఈ అభిమానులు ఎంత‌కైనా తెగిస్తారు. ఇలాంటి సిట్యువేష‌న్స్‌లో ఓ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌కు తెర‌లేపారు రాజ‌మౌళి.

మ‌రి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నువ్వా నేనా అనేలా పోటీ ప‌డే ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌ను క‌లిపిన రాజ‌మౌళి వారి అభిమానుల‌ను సైతం క‌లప‌గ‌లుగుతారా.. భిన్న దృవాలుగా నిత్యం కొట్లాడే ఫ్యాన్స్‌ని ప్ర‌స‌న్నం చేయ‌డంలో స‌క్సెస్ అవుతాడా అనేది ఇప్పుడు జ‌క్క‌న్న ముందున్న పెద్ద టాస్క్. ఎందుకంటే ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ల‌లో ఒక‌రు క‌నిపిస్తే మ‌రొక‌రు వినిపించేలా రాజ‌మౌళి జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, వ్యూస్‌లో మేమే టాప్, లైక్స్‌లో మేమే తోపు అంటు సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రు హీరోల అభిమానులు గోల స్టార్ట్ చేశారు. టీజ‌ర్స్ ద‌గ్గ‌రే ప‌రిస్థితి ఇలా ఉంటే ముందు ముందు సినిమా పైన ప్ర‌భావం ప‌డే చాన్స్ ఉంది. దీంతో ఇద్ద‌రిలో ఏ ఒక్క‌రిని హైలెట్ చేసినా ఫ్యాన్స్ మ‌ధ్య యుద్ధం త‌ప్పదు. మ‌రి నంద‌మూరి, మెగా ఫ్యాన్స్‌ని జ‌క్క‌న్న ఎలా గెలుకుంటాడో అనేది ఆశ‌క్తిగా మారింది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus