RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తి.. కానీ?

తెలుగు, హిందీ, తమిళం, ఇతర భాషల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటైన ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తైంది. చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్నచిన్న షాట్స్ మినహా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.

2018 సంవత్సరం నవంబర్ నెల 19వ తేదీన ఏ బైక్ షాట్ తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలైందో అదే బైక్ షాట్ తో షూటింగ్ పూర్తైంది. త్వరలో ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ఇస్తామని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దోస్తీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

చిత్రయూనిట్ మాత్రం రిలీజ్ డేట్ గురించి వైరల్ అయిన వార్తల విషయంలో స్పందించడం లేదు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడంతో చెప్పిన తేదీకే ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయం కేటాయించడంతో ఈ సినిమా వల్ల శ్రమకు తగ్గ ఫలితం వస్తుందని భావిస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus