బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.’బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడం పైగా ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమా కావడంతో మొదటి నుండీ ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 4 ఏళ్ళు ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ‘బాహుబలి 2’ అంత పెద్ద హిట్ కాదు అని రాజమౌళి స్వయంగా అంగీకరించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ‘ఆర్.ఆర్.ఆర్’ భారీ కలెక్షన్స్ నే సాధించింది.
చరణ్,ఎన్టీఆర్ ల డ్యాన్స్ మరియు పెర్ఫార్మెన్స్‌లకు ఇండియా మొత్తం షేక్ అయ్యింది. అజయ్ దేవగన్, అలియా భట్, ఒలీవియా మోరిస్, శ్రీయ వంటి స్టార్ లు కూడా కీలక పాత్రలు పోషించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తాజా సమాచారం. ‘ఆర్.ఆర్.ఆర్’ డిజిటల్ హక్కులను విడుదలకు ముందే భారీ రేటుకి అమ్మారు మేకర్స్.
దాని ద్వారా భారీ లాభాలను కూడా ఆర్జించారు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మే 20 నుండీ ‘జీ5′ ,’నెట్ ఫ్లిక్స్’ లో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజున ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా కావడం మరో విశేషం. థియేటర్లలో మిస్ అయిన వాళ్ళతో పాటు, సినిమాని ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడాలని తహతహలాడుతున్నారు. మరో 10 రోజుల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ 50 రోజులు పూర్తి చేసుకుంది. సమ్మర్ హాలిడేస్ కు ‘ఆర్.ఆర్.ఆర్’ ఓటిటిల్లో కూడా సందడి చేయబోతున్న మాట.