RRR OTT: ఆ సీన్లు ఆర్ఆర్ఆర్ ఓటీటీ వెర్షన్ లో ఉంటాయా?

ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఏకంగా 494 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. దాదాపుగా 900 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని ఈ సినిమా అరుదైన రికార్డులను సృష్టించింది. అయితే పలు ఏరియాల్లో బాహుబలి2 సాధించిన కలెక్షన్లను ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేయడం కష్టమనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ మూడు గంటల 2 నిమిషాల నిడివితో రిలీజైన సంగతి తెలిసిందే.

Click Here To Watch NOW

అయితే నిడివి ఎక్కువగా ఉన్నా ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టలేదు. కానీ నిడివి ఎక్కువగా ఉండటం వల్ల ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ఎడిటింగ్ లో పోయాయి. అయితే ఆర్ఆర్ఆర్ ఓటీటీ వెర్షన్ లో ఆ సీన్లు ఉంటే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఓటీటీలో ఎంత రన్ టైమ్ ఉన్నా ప్రేక్షకులు ఇబ్బంది పడరు. సీన్ నచ్చకపోతే ఫార్వర్డ్ చేసుకునే సదుపాయం ఓటీటీలో ఉంటుంది కాబట్టి ఓటీటీలో కొత్త సీన్లు ఉంటే సినిమాను చూసే ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

మరి రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ ఓటీటీ వెర్షన్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఈ వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగులో జీ5 యాప్ లో ఆర్ఆర్ఆర్ ఓటీటీలో రిలీజ్ కానుంది. సినిమా విడుదల తేదీ నుంచి 50 రోజుల తర్వాతే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రావచ్చని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఓటీటీలో ఆర్ఆర్ఆర్ ఎప్పుడు విడుదలైనా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన తర్వాత జీ5 యాప్ కు ఊహించని స్థాయిలో సబ్ స్క్రైబర్లు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus