RRR Movie: బయ్యర్ల డిమాండ్ తో దానయ్యకు టెన్షన్!

తెలుగు సినిమాలకు వచ్చే కలెక్షన్లలో 70 శాతం కలెక్షన్లు ఏపీ నుంచి వస్తాయనే సంగతి తెలిసిందే. ఏపీలో టికెట్ రేట్లను ప్రభుత్వం భారీగా తగ్గించడంతో భారీ బడ్జెట్ సినిమా అయిన ఆర్ఆర్ఆర్ పై ఆ ప్రభావం ఊహించని స్థాయిలో పడింది. ఏపీలో ఆర్ఆర్ఆర్ హక్కులు ఏకంగా 140 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అయితే ఏపీలో టికెట్ రేట్లను తగ్గించడంతో ప్రస్తుతం బయ్యర్లు ఏకంగా 50 శాతం డిస్కౌంట్ కావాలని అడుగుతున్నారు.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు వారం రోజుల ముందు బయ్యర్ల నుంచి వ్యక్తమవుతున్న ఈ డిమాండ్ కు నిర్మాత అంగీకరిస్తే నిర్మాతకు ఏకంగా 70 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానయ్య 30 శాతం డిస్కౌంట్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నా బయ్యర్లు మాత్రం సినిమా రిలీజ్ కు అనుకూల పరిస్థితులు లేవని చెబుతున్నారని బోగట్టా. పుష్ప, అఖండ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా ఏపీలోని మెజారిటీ ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాలేదు.

ఆర్ఆర్ఆర్ సినిమా ఏపీలో బ్రేక్ ఈవెన్ కాకపోతే ఈ సినిమాను ఫ్లాప్ గా పరిగణించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తే మాత్రం నిర్మాతకు మరింత ఎక్కువగా నష్టం తప్పదు. అయితే టికెట్ రేట్లను తగ్గించడం వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు సినిమా చూడటానికి అయ్యే ఖర్చులు తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు తెలంగాణలో టికెట్ రేట్లు మాత్రం ఊహించని స్థాయిలో పెరిగాయి.

ఏపీలో టికెట్ రేట్ల పరిస్థితి అనావృష్టిని తలపిస్తుంటే తెలంగాణలో అతివృష్టిని తలపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణలో టికెట్ ధర ఆహా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ధరకు సమానమని కొందరు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను కొంతమేర పెంచితే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు పెరుగుతాయేమో చూడాలి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus