రాజమౌళి అండ్ కో… సినిమా ప్రచారం స్టార్ట్ చేయనంతవరకే… వన్స్ మొదలెట్టాక ఆ జోరు మామూలుగా ఉండదు అంటుంటారు. గతంలో ఇలాంటి ప్రమోషనల్ స్ట్రాటజీ జక్కన్న మంచి బజ్ తీసుకొచ్చింది. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయంలోనూ అదే పంథా అనుసరిస్తోంది రాజమౌళి టీమ్. మేకింగ్ వీడియోతో ఇటీవల ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇప్పుడు సెకండ్ స్టెప్ వేయబోతోంది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ నుండి ఓ సర్‌ప్రైజ్ ఉండబోతోందట.
‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇద్దరు మహనీయుల స్నేహం నేపథ్యంలో సాగుతుందని ఎప్పుడో చెప్పేశారు. ఇప్పుడు ఫ్రెండ్‌షిప్ డే వస్తుండటంతో దానినే కీ పాయింట్‌గా తీసుకొని ఓ ప్రమోషనల్ సాంగ్ సిద్ధం చేస్తున్నారట. దీనికి సంబంధించి సెట్ పనులు మొదలయ్యాయి. ఆ ఫొటో సొషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాకు కీలక అంశంగా చూపిస్తూ వస్తున్న ఇద్దరు హీరో పాత్రల చేతులు బ్యాగ్రౌండ్‌లో కనిపిస్తూ సెట్ వేస్తున్నారు. పై ఫొటోలో ఉన్నది అదే.
మేకింగ్ వీడియోతోనే దుమ్ముదులిపేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఈ పాటతో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. అభిమాన హీరోలను తెరపై కాకపోయినా… యూట్యూబ్‌లో అయినా చూసి ఆనందిద్దాం అని అనుకునేవారికి ఆగస్టు 1న పండగే.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్