RRR: రాజమౌళి వల్ల నిమిషంలో ఆర్ఆర్ఆర్ షో హౌస్ ఫుల్.. ఏమైందంటే?

ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ విడుదలై రెండేళ్లు అవుతోంది. జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో సైతం ఈ సినిమా అంచనాలకు మించి హిట్ గా నిలిచింది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. బుల్లితెరపై కూడా ఈ సినిమా అదిరిపోయే రేటింగ్ లను సొంతం చేసుకుంది. అయితే జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ సంచలనాలు కొనసాగుతున్నాయి. మార్చి 18వ తేదీన రాజమౌళి జపాన్ లో ప్రదర్శితం కానున్న స్పెషల్ షోకు హాజరు కానున్నారు.

ఈ విషయం తెలిసిన అక్కడి సినీ ప్రేక్షకులు రాజమౌళి (S. S. Rajamouli) సినిమా చూసే థియేటర్ లో బుకింగ్స్ మొదలైన నిమిషంలోపే టికెట్లను కొనుగోలు చేశారు. చాలామంది ప్రేక్షకులు తాము ఎంత ప్రయత్నించినా టికెట్ దొరకలేదని ఫీలవుతున్నారని తెలుస్తోంది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేస్తున్న సంచలన రికార్డులు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ క్రేజ్ జపాన్ లో ఏ మాత్రం తగ్గలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

జపాన్ లో ఈ సినిమా మన రూపాయలలో 18 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ఈ సాంగ్ వల్ల కూడా ఈ సినిమా రేంజ్ పెరిగింది. భవిష్యత్తులో జక్కన్న ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కచ్చితంగా తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ (Mahesh) మూవీ పూర్తైన తర్వాత జక్కన్న ఈ సీక్వెల్ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.

రాజమౌళి వరుసగా భారీ సినిమాలను తెరకెక్కిస్తుండగా భవిష్యత్తు సినిమాలు ఏ రేంజ్ హిట్లుగా నిలుస్తాయో చూడాలి. స్క్రిప్ట్, లొకేషన్ల కోసం జక్కన్న ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తెలుస్తోంది. రాజమౌళి సినిమాలు పాన్ వరల్డ్ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. జక్కన్న సినిమాల కథలు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉండటం గమనార్హం. రాజమౌళి తన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus