ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కొరకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు, ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఈ సినిమాకు అంచనాలను మించి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయని సమాచారం.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు 20 రోజుల సమయం మాత్రమే ఉండగా ఐపీఎల్ సినిమా కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కనీసం మూడు వారాల పాటు ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్లు దొరకడం కష్టమవుతుందని ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ కచ్చితంగా ఉంటారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సినిమాకు 4 గంటల్లోనే 2 లక్షల డాలర్ల కంటే ఎక్కువ మొత్తం బుకింగ్స్ అయ్యాయని సమాచారం. అడ్వాన్స్ బుకింగ్స్ తో ఓవర్సీస్ లో ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మరోవైపు గతంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఆగిన సమయంలో టికెట్లను బుకింగ్ చేసుకున్న ఆడియెన్స్ కు డబ్బులు వెనక్కిచ్చేశామని ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేయగా ఓవర్సీస్ ఆడియెన్స్ మళ్లీ అంతే ప్రేమను చూపిస్తున్నారని ఆర్ఆర్ఆర్ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు కళ్లు చెదిరే రేటుకు అమ్ముడయ్యాయి.
తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తొలిరోజు కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాల్సి ఉంది. బాహుబలి2 కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని థియేటర్లలో ప్రదర్శితం కానుందని సమాచారం అందుతోంది.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!