ప్రతి వారంలానే ఈ వారం కూడా చిన్న సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. అప్పుడప్పుడు ఓటీటీల్లో కూడా కొన్ని సినిమాలు నేరుగా రిలీజ్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అలా ఈ వారం ‘రుద్రమాంబపురం’ అనే సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కమెడియన్ గా, విలక్షణ నటుడిగా సత్తా చాటుతున్న అజయ్ ఘోష్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
కథ : టైటిల్ కి తగ్గట్టే రుద్రమాంబపురం అనే ఊరు.అక్కడ శివయ్య (రాజశేఖర్) అనే ఓ మత్స్యకారుడు అలాగే చేపల వ్యాపారం చేసే తిరుపతి(అజయ్ ఘోష్) ల మధ్య తగాదాలు ఉంటాయి. అయితే తిరుపతి కొడుకు శీనయ్య(అర్జున్ రెడ్డి) తన సర్కిల్ ఉపయోగించి ఎమ్మెల్యే హయాంలో వీరి మధ్య గొడవలు ఆపి సెటిల్ మెంట్ చేయాలని చూస్తాడు. ఈ క్రమంలో అతనికి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. అవేంటి? అసలు వీళ్ళ మధ్య గొడవ ఎందుకు మొదలైంది? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పనితీరు : చెప్పుకోడానికి కథ పెద్దగా లేని ఈ చిత్రాన్ని నటీనటుల తమ నటనతో ఒడ్డుకు చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అజయ్ ఘోష్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాడు అని చెప్పాలి. శివయ్యగా నటించిన రాజశేఖర్ మత్స్యకారునిగా తన సహజమైన నటనతో మెప్పించే ప్రయత్నం చేశాడు. అర్జున్ రెడ్డి పర్వాలేదు అనిపించాడు.మిగిలిన నటీనటులు సో సో గా అనిపిస్తాయి. పెద్దగా రిజిష్టర్ కాకపోవచ్చు.
సాంకేతిక నిపుణులు పనితీరు : రుద్రమాంబపురం అనే టైటిల్ ను బట్టి ఇది రంగస్థలం చిత్రం రేంజ్ లో.. మత్స్యకారుల లైఫ్ స్టైల్ అనగానే ఇది ఉప్పెన చిత్రం రేంజ్ లో ఉంటుంది అని అనుకోము. ఎందుకంటే ఇది చిన్న సినిమా కాబట్టి. కానీ అజయ్ ఘోష్ ఆ సినిమాల స్ఫూర్తితోనే కథ రాసుకున్నారు అనిపిస్తుంది.దర్శకుడు మహేష్ బంటు కూడా వాటి ఫ్లేవర్ నే వడ్డించాలి అనుకున్నాడు. అలాంటి సీన్లు వచ్చినప్పుడు విసుగొస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలు సహజంగా తీసిన అనుభూతి కలుగుతుంది. అయినప్పటికీ కనెక్టివిటీ లోపించింది అని కూడా చెప్పాలి. ఎన్.సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఓకె. వెంగి బిజియం సో సో ఉంటుంది.
విశ్లేషణ : ఇలాంటి రా సబ్జెక్ట్ లు కంప్లీట్ గా డైరెక్షన్ పైనే ఆధారపడి ఉంటాయి. ఈ మూవీ విషయంలో మైనస్ అయ్యింది అదే. ఫస్ట్ హాఫ్ కొంత ఓకె అనిపించినా.. సెకండ్ హాఫ్ బోరింగ్ గా సాగుతుంది. ఓటీటీ మూవీ అయినా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్ చేయలేము.