కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే… కృష్ణమూర్తి విగ్రహాల వద్దకు వెళ్లగా కావ్య మరో రెండు విగ్రహాలు పూర్తి చేయాల్సి ఉండగా వాటికి రంగులు వేస్తూ ఉంటుంది అంతలోపు అక్కడికి రాజ్ వెళ్తాడు. నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను అని రాజు చెప్పగా మరి కాస్త పని ఉంది కొంచెం ఆలస్యం అవుతుంది కాసేపు ఆగండి అని చెప్పడంతో రాజ్ కూడా అక్కడే కూర్చుంటారు అయితే కావ్య రాజ్ తో మాట్లాడుతూ..
ఈరోజు రాత్రికి మీరు ఇక్కడే ఉండిపోండి అంటూ చెబుతుంది. పని పూర్తి అవుతుందని చెప్పావు కదా మళ్ళీ ఇదేంటి అని రాజ్ ప్రశ్నించడంతో అలానే ఏం కాదు ఇంత పెద్ద కాంటాక్ట్ మాకు రావడానికి కారణం మీరే కదా అందుకే రేపు పొద్దున గుమ్మడికాయ కొట్టి ఈ కాంట్రాక్ట్ పూర్తి చేయండి అని కావ్య చెప్పడంతో రాజ్ కాదనలేక అక్కడే ఉండిపోతారు. మరోవైపు రాహుల్ పంపించిన రౌడీలు కృష్ణమూర్తి అక్కడి నుంచి వెళ్తే విగ్రహాలు దొంగలించాలని ఎదురు చూస్తూ ఉంటారు. మరోవైపు అపర్ణ తన కోడలు ఇంటికి రాకపోవడంతో ఎదురు చూస్తూ ఉంటుంది.
అంతలోపు సీతారామయ్య అక్కడికి రావడంతో ఎవరికోసం ఎదురు చూస్తున్నావమ్మా అని చెప్పడంతో ఈ ఇంటి కోడలు ఇలాంటి సమయంలో ఇక్కడికి రావడం ఏమైనా బాగుంటుందా అయినా మీరు తనని ప్రతి విషయంలో వెనకేసుకొని రావడం మానేయండి మావయ్య గారు. ఈ కాంట్రాక్టు పూర్తి అయింది కదా ఇకపై తన కుటుంబ విషయాలలో కావ్యను కలుగజేసుకోమని చెప్పకండి అంటూ చెబుతుంది. నువ్వు ఇలా భయపడాల్సిన అవసరం లేదు కావ్య ఆలస్యం అవుతుందని నాకు ఫోన్ చేసి చెప్పింది అందుకే రాజ్ ను వెళ్లి తీసుకు రమ్మని చెప్పాను అంటూ సీతారామయ్య చెప్పగా అపర్ణ షాక్ అవుతుంది.
వెంటనే సీతారామయ్య రాజ్ కి ఫోన్ చేయగా ఇప్పుడే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను తాతయ్య మీరే చేశారు ఈరోజు రాత్రికి నేను ఇక్కడే ఉంటున్నాను ఈ కాంట్రాక్ట్ నా వల్లే వచ్చిందని వీళ్లు నా చేత రేపు ఉదయం గుమ్మడికాయ కొట్టించాలని చెబుతున్నారు అందుకే ఇక్కడే ఉన్నాను అని చెప్పడంతో మంచి పని చేశావు అంటూ సీతారామయ్య సంతోషపడతాడు. ఈ విషయం అమ్మకు కూడా చెప్పండి తాతయ్య అంటూ రాజ్ ఫోన్ పెట్టేస్తారు.
ఇదంతా విన్నటువంటి రుద్రాణి వెంటనే పైకి వెళ్లి తన కొడుకుకి ఫోన్ చేసి రాజ్ కూడా అక్కడే ఉన్నారు. మనం దొరికిపోతామేమో అని చెప్పగా ఉంటే ఉండనివ్వు వాడు అడ్డు వస్తే వాన్ని కూడా నాలుగు తంతారు అంటూ తన తల్లికి చెబుతారు. ఇక రాజ్ పడుకుని ఉండగా కావ్య అప్పు అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య పక్కన లేకపోవడంతో రాజ్ కిటికీలో నుంచి చూడగా వారందరూ మాట్లాడుకోవడం చూస్తారు
అలాగే కావ్య కనకం అప్పు మంట వేసుకొని ఎంచక్కా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదంతా గదిలో నుంచి చూస్తున్నటువంటి రాజ్ సంతోషపడతారు. మరోవైపు రౌడీలు విగ్రహాలు దొంగలించడానికి వస్తారు అయితే కృష్ణమూర్తి అడ్డు రావడంతో ఆయనని కొట్టి విగ్రహాలన్నింటిని దొంగలిస్తారు. ఇంతటితో ఈ (Brahmamudi) ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!