Bangarraju: బంగార్రాజుకు సీక్వెల్ దిశగా అడుగులు.. నాగ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాలు నాగార్జున సినీ కెరీర్ లో ఎంతో స్పెషల్ అనే సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఈ రెండు సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. బంగార్రాజు తర్వాత కళ్యాణ్ కృష్ణ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించలేదనే సంగతి తెలిసిందే. చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.

అయితే కళ్యాణ్ కృష్ణ తర్వాత ప్రాజెక్ట్ గా బంగార్రాజు సీక్వెల్ తెరకెక్కనుందని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్తల గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. బంగార్రాజు సీక్వెల్ తెరకెక్కితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది.

బంగార్రాజు (Bangarraju) సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. కళ్యాణ్ కృష్ణ నాగార్జునతో మరో కొత్త కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగ్ సైతం ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. నాగ్ తో సినిమాలను నిర్మించడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

నాగ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కి కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. నాగ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి. నాగ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. నాగార్జున కథ నచ్చితే సొంత బ్యానర్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus