ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ మిర్చి సినిమా నుంచి భరత్ అనే నేను సినిమా వరకు వరుస విజయాలను అందుకున్నారు. అయితే కొరటాల శివ సినీ కెరీర్ లోనే ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న సినిమాగా నిలిచిన ఆచార్య సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. ఈ సినిమా బడ్జెట్ కు సాధించిన కలెక్షన్లకు పొంతనే లేదనే సంగతి తెలిసిందే.
అయితే ఆచార్య నష్టాలను భర్తీ చేయడానికి కొరటాల శివ ఆస్తులు అమ్మేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆచార్య రిజల్ట్ వల్ల కొరటాల శివ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కొరటాల శివ క్లారిటీ ఇస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొరటాల శివ ఒక ప్రాపర్టీని అమ్మేశారని ఆ ప్రాపర్టీ విలువ 15 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.
ఆచార్య సినిమా ఆలస్యం కావడం వల్ల కొరటాల శివ ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలు చూసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో కొరటాల శివ తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్తులు అమ్మేశారని సమాచారం అందుతోంది. ఆచార్య సినిమా నిర్మాణ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వల్లే కొరటాల శివకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.
మరోవైపు కొరటాల శివ ఎన్టీఆర్ కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుంచి మొదలుకానుంది. రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా బాలీవుడ్ హీరోయిన్ ఈ సినిమాలో నటించే అవకాశం ఉంటుంది. కొరటాల శివ ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!