Prabhas: ప్రభాస్ కు వాళ్లకు మధ్య దూరం పెరిగిందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ గురించి ఈ మధ్య కాలంలో అనేక రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు కాబట్టి వైరల్ అవుతున్న రూమర్లలో చాలా రూమర్ల గురించి స్పష్టత రావడం లేదు. ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల బడ్జెట్ ఏకంగా 2000 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ప్రభాస్ ఈ మధ్య కాలంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఎక్కువగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

యూవీ క్రియేషన్ బ్యానర్ పై సినిమాలను తెరకెక్కిస్తున్న నిర్మాతలు ప్రభాస్ స్నేహితులు అనే సంగతి కూడా తెలిసిందే. అయితే ప్రభాస్ కు, ఈ బ్యానర్ కు మధ్య దూరం పెరిగిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న ఈ వార్తల వల్ల ప్రభాస్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే వైరల్ అవుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు. ఎవరో కావాలని ఈ తరహా ప్రచారం చేస్తున్నారని ప్రభాస్ సన్నిహితులు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా 20,000 స్క్రీన్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. పాన్ వరల్డ్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూ ప్రభాస్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏడాదికి రెండు సినిమాల చొప్పున ప్రభాస్ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న ఇతర సినిమాలకు కూడా యూవీ క్రియేషన్స్ నిర్మాతలు తమ వంతు సహకారం అందిస్తున్నారని బోగట్టా.

వరుసగా సినిమాలలో నటిస్తూ ప్రభాస్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమా షూటింగ్ లను ప్రభాస్ ఇప్పటికే పూర్తి చేశారు. అందువల్ల ఈ ఏడాది ఈ రెండు సినిమాలు కచ్చితంగా విడుదలవుతాయి. ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus