Vaishnav Tej: రెండింటి నేపథ్యం ఒకటే.. కథ అదేనా మార్చారా!

ఒకరి కోసం అనుకున్న సినిమా మరొకరు చేయడం సినిమా పరిశ్రమలో కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది చేశారు, హిట్లు కొట్టారు. ఇంకొంతమంది జడ్జిమెంట్‌ తేడా కొట్టి ఫ్లాప్‌లు మూటగట్టుకున్నారు. ఫలితాల సంగతి పక్కన పెడితే ఇలాంటి మిస్సింగ్‌ ఛాన్స్‌లు చాలానే ఉన్నాయి. కొన్ని ముందే ఆగిపోతే, ఇంకొన్ని మొదలయ్యాక నిలిచిపోయాయి. అలా నిలిచిపోయిన ఓ సినిమానే ఇప్పుడు వైష్ణవ్‌ తేజ్‌ చేస్తున్నాడా? ఏమో ప్రస్తుతం టాలీవుడ్‌ దీని గురించే చర్చ నడుస్తోంది.

వైష్ణవ్‌ తేజ్‌ నాలుగో సినిమాగా ఇటీవల ఓ సినిమా ప్రారంభమైంది. శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిజానికి ఈ పేరు టాలీవుడ్‌కి కొత్తేం కాదు. గతంలో ఓ సందర్భంగా ఘనంగా విన్నాం కూడా. మంచు మనోజ్‌ రీఎంట్రీ సినిమా రూపొందాల్సిన ‘అహం బ్రహ్వాస్తి’ సినిమాతో ఈయన టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వాల్సింది. ఆ సినిమా ఎంతో ఘనంగా మొదలైంది. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల ఆగిపోయిందన్నారు. అయితే అది కామా కాదని, ఏకంగా ఫుల్‌ స్టాప్ అని ఇప్పుడు తేలింది.

వివిధ కారణాల వల్ల ఆ సినిమాను మనోజ్‌ వద్దనుకున్నారట. దీంతో దర్శకుడు శ్రీకాంత్‌.. చాలామందికి కథ చెప్పి ఆఖరికి వైష్ణవ్‌తేజ్‌తో సినిమా చేస్తున్నాడట. అయితే ‘అహం బ్రహ్మాస్మి’ కథ, ఇప్పుడు అనౌన్స్‌ చేసిన కథ రెండూ ఒకటేనా, లేకపోతే కాన్సెప్ట్‌ మాత్రమే ఒక్కటా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు సాఫ్ట్‌ క్యారెక్టర్‌తో కనిపించిన వైష్ణవ్‌తేజ్‌ను ఫుల్‌ మాస్‌ యాంగిల్‌లో చూపించబోతున్నారు శ్రీకాంత్‌.

‘అహం బ్రహ్మాస్మి’ పోస్టర్లు, సినిమా లాంచ్‌ అయినప్పుడు చెప్పిన విషయాలు, ఇప్పుడు వైష్ణవ్‌ తేజ్‌ సినిమా పోస్టర్, డైలాగ్‌లు వింటుంటే రెండు సినిమాలు ఒకటే అనే ఫీలింగ్‌ అయివస్తోంది. మరి రెండూ ఒకటేనా కాదా అనేది దర్శకుడో, చిత్రబృందమో చెప్పాలి. లేదంటే వచ్చే సంక్రాంతి వరకు ఆగి సినిమా అప్పుడు వస్తే చూడాలి. ఈలోపు క్లారిటీ వచ్చేస్తుంది లెండి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus