బుల్లితెర పై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రావణి (26) మృతి చెందడం పెద్ద దుమారాన్నే రేపింది. ‘మనసు మమత’, ‘మౌనరాగం’ వంటి సీరియల్స్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న శ్రావణి.. ఇలా సడెన్ గా మృతిచెందడం పై కేసు నమోదవ్వడం.. అది రోజుకో మలుపు తిరుగుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ‘సాయికృష్ణ అనే వ్యక్తి ఆమెను ప్రేమించి మోసం చేసాడని.. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని’ కొందరు.. లేదు ఈమెను దేవరాజ్ వేధింపులకు గురిచేసాడని అందుకే ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేవరాజు రెడ్డి, సాయి కృష్ణ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఈ క్రమంలో కాల్ ట్యాపింగ్ లో భాగంగా ‘ఆర్.ఎక్స్.100’ నిర్మాత అశోక్ రెడ్డి కూడా నిందితుడుగా ఉన్నట్టు వారు గుర్తించారు.
ఈయనకు పోలీసులు నోటీసులు పంపితే విచారణకు హాజరుకాలేదట. దీంతో పోలీసులకు మరింత అనుమానం పెరిగింది. నిజానికి అశోక్ రెడ్డి విచారణకు హాజరవుతానని చెప్పాడట. కానీ చివరి నిమిషంలో ఎస్కేప్ అయ్యి మొబైల్ స్విచాఫ్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని శ్రావణిని నమ్మించి.. ఆయన సంబంధాలు నడిపినట్టు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అయితే మధ్యలో శ్రావణి… దేవరాజ్ కు దగ్గరయ్యిందట. ఈ విషయాన్ని అశోక్ రెడ్డి తట్టుకోలేకపోయాడని తెలుస్తుంది. సాయికృష్ణ ద్వారా శ్రావణి… దేవరాజ్ తో విడిపోయేలా అశోక్ రెడ్డి ప్లాన్ చేశాడట.సెప్టెంబర్ 7న అమీర్ పేట దగ్గర ఓ హోటల్ వద్ద శ్రావణి, దేవరాజులతో గొడవ తర్వాత సాయికృష్ణ… శ్రావణిని ఇంటికి తీసుకుని వెళ్ళాడట.
అక్కడ అశోక్ రెడ్డి కూడా ఉండడం.. వీళ్ళిద్దరూ కలిసి శ్రావణిని శారీరకంగా హింసించి చంపినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆత్మహత్యకు ముందు రోజు జరిగిన వ్యవహారాల్లో కూడా అశోక్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు కూడా తెలుస్తుంది. ఇదిలా ఉండగా .. దేవరాజు తనని వేధిస్తున్నాడంటూ జూన్ 22న ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది శ్రావణి. మళ్ళీ మరుసటి రోజున శ్రావణి పోలీసు స్టేషన్ కు వెళ్లి దేవరాజ్ ను అరెస్టు చెయ్యొద్దని, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పిందట. ఇలా ఈమె కేసు రకరకాలుగా ఉంది. అసలు విషయం ఏమిటన్నది ఇంకా తేలక పోలీసులు తలపట్టుకుంటున్నారు. అశోక్ రెడ్డి పట్టుబడితేనే కానీ ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేలా లేదు. అందుకే అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!