అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ ‘సాహో’ అనిపిస్తుంది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. ఆగష్టు 30 న అంటే మరో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్ లో అదే రేంజ్లో బుకింగ్స్ జరుగుతుండడం విశేషం. ఖాన్ ల త్రయం సినిమాలు విడుదలయ్యే సమయంలో కనిపించని హడావుడి సైతం ‘సాహో’ హిందీ వర్షన్ కు కనిపిస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.

‘సాహో’ చిత్రానికి ‘బుక్ మై షో’ లో మూడున్నర లక్షలకు పైగా లైక్స్ రావడం ఓ సంచలనమనే చెప్పాలి. ఇక ఈ చిత్రం మొదటి రోజు బుకింగ్స్ పెట్టిన థియేటర్లు పెట్టినట్టే అయిపోతున్నాయి. కేవలం మొదటి రోజుకి మాత్రమే కాదు వీకెండ్ కు కూడా బుకింగ్స్ అయిపోతున్నాయి. వచ్చే సోమవారం అంటే సెప్టెంబర్ 2 వ తేదీన వినాయక చవితి సెలవు ఉండటంతో ఆ రోజు మరిన్ని ఎక్కువ బుకింగ్స్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు. మొదటి రోజు ఈ చిత్రానికి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు ఓ రేంజ్లో ఉంటాయని వారు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus