ప్రభాస్ సాహోతో ఎంతో నేర్చుకుంటున్నా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత చిత్రాలైన బాహుబలి 1, 2 లో నటించడం అంతసులువుకాదని.. ఆ చిత్రానికి పనిచేసిన నటీనటులు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాకి పనిచేస్తున్న నటీనటులు భావన కూడా అదే. ఎందుకంటే భాషాభేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆనందింపజేయించాలని లక్ష్యంతో ఈ సినిమాను చేస్తున్నారు కాబట్టి. 150 కోట్ల భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు వారికీ పరిచయం అవుతున్నారు. అతను నేడు ఓ వాణిజ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాహో అనుభవాన్ని పంచుకున్నారు. “సాహో మేము అనుకున్నదానికంటే బాగా రూపుదిద్దుకుంటోంది. ఇతర చిత్రాలతో పోల్చితే ఈ సినిమాకి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సివస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ డైలాగులను నేర్చుకొని.. ఒకదాని తర్వాత మరొకదాన్ని చెప్పాల్సి వస్తోంది. ఇలా ఈ సినిమా ద్వారా అనేక కొత్త సంగతులు నేర్చుకుంటున్నాను” అని నీల్ నితిన్ ముఖేష్ వివరించారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె కేవలం రొమాంటిక్ సన్నివేశాలకు పరిమితం కాకుండా ప్రభాస్ తో కలిసి యాక్షన్ సన్నివేశాల్లో విన్యాసాలతో అదరగొట్టనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus