బాలీవుడ్ లో మొత్తం కలిపి 150 కోట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు

ఇండియాస్ కాస్ట్లీయస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రొజెక్ట్ చేయబడి.. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “సాహో” సినిమాకి వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా ప్రీబుకింగ్స్ పుణ్యమా అని షాకింగ్ వసూళ్లు సాధించినప్పటికీ.. సినిమా రూపొందిన బడ్జెట్ కి, వచ్చిన కలెక్షన్స్ కి ఎక్కడా పొంతన కనిపించడం లేదు. ముఖ్యంగా.. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా.. విడుదలైన నాలుగు భాషల్లో మొత్తం కలిపి అయిదు రోజుల్లో కేవలం 350 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

“సాహో” విడుదలకు ముందు బాలీవుడ్ రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేయడం ఖాయం అనుకొన్నారు. ఖాన్ హీరోల రికార్డ్స్ ను బ్రేక్ చేయడం అటుంచితే కనీసం షాహిద్ కపూర్ “కబీర్ సింగ్” రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేయలేకపోయింది సాహో. 50 కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన కబీర్ సింగ్ కేవలం హిందీలోనే 279 కోట్లు వసూలు చేయగా.. సాహో మొత్తం కలిపి 150 కోట్లు వసూలు చేసే అవకాశం కూడా కనిపించడం లేదు. మరి అలాంటప్పుడు సాహో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అని సంకలు గుద్దుకోవడం అనేది హాస్యాస్పదం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus