ప్రభాస్ పుట్టినరోజున ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వనున్న సాహో టీమ్

ప్రభాస్ అభిమానులు సుజీత్ పై చాలా కోపంగా ఉన్నారు. సాహో సినిమా గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి కానీ… ఆ చిత్రంలోని స్టిల్స్ ఒక్కటికూడా బయటికి రావడం లేదు. ఫుల్ కోట్ లో కళ్ళు మాత్రమే కనిపించే లుక్ తప్పించి ప్రభాస్ కి సంబంధించిన ఏ స్టిల్ ని రిలీజ్ చేయలేదు. ఏడాదిగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు? ఆడియో ఎప్పుడు ? కనీసం రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించలేదు. అందుకే యూవీ క్రియేషన్స్ పై కూడా ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. వ్యంగ్యంగా మీమ్స్ కూడా చేశారు. ఈ విషయం గ్రహించిన నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు అభిమానులను శాంతిపజేసే పనులు చేపట్టారు.

అందులో భాగంగా ఓ మేకింగ్ వీడియోని ఎడిట్ చేసారని తెలిసింది. దుబాయ్ లోని అబుదాబిలో 70 కోట్లతో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరించారు. ఆ ఫైట్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ఇది. ఈ వీడియోని ప్రభాస్ పుట్టినరోజు ( ఈ నెల 23 )న ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వాలని చూస్తున్నారు. ఈ వీడియోకి మ్యూజిక్ యాడ్ చేసే పని చెన్నైలో వేగంగా జరుగుతోందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేకింగ్ వీడియో ఫ్యాన్స్ కోపాన్ని పోగొడుతుందని, సాహోపై అంచనాలను పెంచేస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus