రాధేశ్యామ్.. ఇలా అయితే కష్టమే?

  • February 12, 2021 / 01:15 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న మరో బిగ్ బడ్జెట్ మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. యూవీ క్రియేషన్స్ నత్త నడక ఏమిటో మరోసారి ఋజువవుతోంది. చిన్న పోస్ట్ చేసిన కూడా అభిమానులు వాళ్ళపై ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఇంతవరకు సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా ఒక్క పని కూడా చెయ్యలేదు. ఆ మధ్య ఓ మోషన్ పోస్టర్ వదిలారు గాని దాన్ని జనాలు నాలుగు రోజులు కూడా గుర్తు పెట్టుకోలేదు.

ఆ సంగతి అటుంచితే ఇప్పుడే రాధేశ్యామ్ బిజినెస్ తో ప్రభాస్ రేంజ్ బాగా తగ్గినట్లు రుమర్స్ వస్తున్నాయి. గ్యాప్ లేకుండా పాన్ ఇండియా సినిమాలను బాగానే లైన్ లో పెడుతున్నాడు గాని రాధేశ్యామ్ పై బిజినెస్ చెయ్యడానికి డిస్ట్రిబ్యూటర్స్ డేర్ చేయడం లేదు. సాహో ప్రభావం రాధేశ్యామ్ పై పడినట్లు తెలుస్తోంది. సాహో అయితే నార్త్ లో ఎదో పెట్టిన పెట్టుబడికి కొంత లాభం మాత్రమే ఇచ్చింది. కానీ సౌత్ లో అయితే అన్ని భాషల్లో బయ్యర్లను నిండా ముంచేసింది.

దీంతో తెలుగు బయ్యర్లు సినిమాను భారీ ధరకు కొనడానికి ముందుకు రావడం లేదు. నాన్ బాహుబలి రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ చేసే అవకాశం ఎంత మాత్రం లేదని సమాచారం. ఇక ఆచార్య మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే కూడా తెలుగు రాష్ట్రాల్లో రాధే శ్యామ్ 10% తక్కువగానే ధర పలుకుతున్నట్లు సమాచారం. మరి టీజర్ తరువాత అయినా ధరల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus