‘సాహో’ ఓవర్సీస్ రివ్యూ వచ్చేసింది!

  • August 26, 2019 / 01:53 PM IST

‘బాహుబలి2’ తరువాత సుజీత్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్ తో ‘యూ.వి.క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ లు చాలా గట్స్ తో నిర్మించారనే చెప్పాలి. ఒక కుర్ర డైరెక్టర్ ను నమ్మి ఇంత బడ్జెట్ ఎలా పెట్టారు అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే నిజంగానే సుజీత్ ‘సాహో’ ని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించాడని టీజర్ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఇక ‘సాహో’ సంబంధించి ఓవర్సీస్ నుండీ ఫస్ట్ రివ్యూ వచ్చింది. ఆ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

కథ : ముంబైలో జరుగుతున్న దొంగతనాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ఓ అండర్ కవర్ పోలీస్ ని నియమిస్తారు పోలీసులు. అతను అలా ఆ మిస్టరీ చేజ్ చేసే క్రమంలో హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఇలా ప్రేమాయణం కొనసాగిస్తున్న తరుణంలో సడెన్ గా హీరో నెగెటివ్ గా మారతాడు. అసలు హీరో దొంగా? పోలీసా? అసలు హీరో ఇలా నెగిటివ్ గా మారడానికి కారణాలేమిటి. కట్ చేస్తే హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. హీరో గతంలో ఏం జరిగింది..? అనేది మిగిలిన కథాంశం అని తెలుస్తుంది.

బాలీవుడ్ టు హాలీవుడ్ ప్రభాస్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడు. యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు… నెగిటివ్ రోల్లో కూడా ఇరక్కొట్టేశాడు. ఈ పాత్రకి ప్రభాస్ ను తప్ప మరెవర్నీ ఊహించుకోలేనంత అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ‘బాహుబలి’ తో బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్… ‘సాహో’ తో హాలీవుడ్ రేంజ్ హీరో అవుతాడని గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు.

శ్రద్దా కపూర్ : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా శ్రద్దా కపూర్ అమృత పాత్రలో ఒదిగిపోయింది. ఈమెకు సంబందించిన ట్విస్ట్ కూడా ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుందట. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ లో కూడా ఈమెకు మరిన్ని అవకాశలు వస్తాయని చెబుతున్నారు.

బ్యాడ్ బాయ్ సాంగ్ : ఈ చిత్రంలో ప్రభాస్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు మధ్యలో వచ్చే ఈ స్పెషల్ సాంగ్ కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉందట. విడుదల చేసిన పాటల్లో కూడా ఈ పాటకే ఎక్కువ ఆదరణ దక్కింది.

జిబ్రాన్ సంగీతం : ఈ చిత్రానికి ప్రభాస్ తరువాత మేజర్ హైలెట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని తెలుస్తుంది. జిబ్రాన్ ఈ చిత్రానికి హాలీవుడ్ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సమకూర్ఛాడట. ప్రభాస్ యాక్షన్ కు జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు బలం అని తెలుస్తుంది.

సుజీత్ : కుర్ర డైరెక్టరే అయినప్పటికీ ‘సాహో’ తో తెలుగు ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్నాడట సుజీత్. ప్రతీ సీన్ ను కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు.. ప్రేక్షకులు అందరూ ఎంజాయ్ చేసేలా థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే తో ‘సాహో’ ను తెరకెక్కించాడట. ఎక్కడా బోరింగ్ ఎలిమెంట్ కు స్థానం లేకుండా ఎంతో శ్రద్ధతో ‘సాహో’ ని తీసాడని తెలుస్తుంది. ‘కె.జి.ఎఫ్’ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఇండియా వైడ్ ఎంత గుర్తింపు వచ్చిందో… ‘సాహో’తో సుజీత్ కు కూడా అదే స్థాయి గుర్తింపు లభిస్తుందని ఓవర్సీస్ సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

చివరి మాట : క్లాస్, మాస్, అనే తేడా లేదు… ‘సాహో’ ప్రతీ ప్రేక్షకుడిని కుర్చీకి కట్టి పడేస్తుందట. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ కు ఇది పర్ఫెక్ట్ మూవీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ‘సాహో’…. “స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్”.

గమనిక : ఈ రివ్యూ ప్రముఖ సినీ క్రిటిక్ ట్వీట్ ని ఆధారం చేసుకొని రాసింది. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఫిల్మ్ ఫోకస్ రివ్యూ, రేటింగ్ ఆగష్టు 30 న రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus