నెక్స్ట్ షెడ్యూల్ రొమేనియాలో ప్లాన్ చేసిన సుజీత్

బాహుబలి తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ యువ డైరక్టర్ సుజీత్ ఆలోచనను నమ్మి ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నారు. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్నప్పటికీ మూడువందల కోట్లు గుమ్మరించడానికి నిర్మాతలు వంశీ ప్రమోద్ లు వెనుకాడడం లేదు. రీసెంట్ గా 70 కోట్ల ఖర్చుతో అబుదాబిలో భారీ యాక్షన్ సీన్ కంప్లీట్ చేశారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ సీన్ సినిమాలో హైలెట్ గా నిలవనుంది. ఇప్పుడు మరో యాక్షన్ సీన్ తీస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన మార్కెట్‌ సెట్‌ లోనే కొత్త షెడ్యూల్ గత వారం మొదలయింది. ఈ షూటింగ్ లో శ్రద్ధాకపూర్‌ తో పాటు కొంతమంది నటీనటులు పాల్గొంటున్నారు. నలభై రోజులకు పైగా ఈ షెడ్యూల్‌ జరగనుంది.

కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ తో దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక పాటల కోసం చిత్ర బృందం రొమేనియా కి వెళ్లనుంది. అక్కడ అందమైన లొకేషన్లలో రెండు పాటలను తెరకెక్కించనున్నారు. అలాగే కొన్ని రొమాన్స్ సీన్స్ కూడా షూట్ చేయనున్నట్టు సమాచారం. నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే, జాకీష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిర బేడీ, ఎవ్లిన్‌ శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్న సాహో వేసవికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus