భారతీయ సినిమా స్థాయిని పెంచేందుకు శ్రమిస్తున్న సాహో టీమ్

  • June 4, 2018 / 07:00 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఐదేళ్లు శ్రమించి బాహుబలి వంటి చిత్రాలను మనకందించారు. ఏ స్టార్ హీరో చేయనటువంటి సాహసం చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచారు. మొన్నటి వరకు భారతదేశంలో బాలీవుడ్ మాత్రమే అద్భుత చిత్రాలను తీయగలదని చెప్పుకునేవారు. నార్త్ ఇండియాలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందిందని ప్రచారం సాగింది. బాహుబలి ఈ అపోహలన్నిటినీ పటాపంచలు చేసింది. కోలీవుడ్ సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు ప్రభాస్ మరో అడుగు ముందుకు వేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ సినిమా అని కాకుండా ఇండియన్ సినిమా అని ప్రపంచదేశాలవారు చెప్పుకునేలా ప్లాన్ వేశారు. యువ దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో మూవీ భాషాబేధ హద్దులను చెరిపేయనుంది.

అందుకు తగ్గట్టుగానే ఆర్టిస్టుల సెలక్షన్ చేశారు. హీరోయిన్ గా శ్రద్ధా కపూర్‌, విలన్ గా నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ఇతర పాత్రల్లో మహేశ్‌ మంజ్రేకర్‌, చుంకీ పాండే, మందిరా బేడీ, ఎవలీన్‌ శర్మ లను తీసుకున్నారు. వీరంతా బాలీవుడ్ ఆర్టిస్టులే. ఇక తమిళ నటుడు అరుణ్‌ విజయ్‌, మలయాళీ నటుడు లాల్‌ కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ తో పాటు అనేక మంది హాలీవుడ్ నిపుణులు ఇందుకోసం పనిచేస్తున్నారు. గతంలో యాక్షన్ సీన్స్ అంటే హాలీవుడ్ మూవీ గుర్తుకు వచ్చేది. అందుకు ఏ మాత్రం తగ్గకుండా సాహో లో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి. అన్నిరకాలుగా సాహో భారతీయ సినిమా స్థాయిని పెంచనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus