సీనియర్ స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారి తనయుడు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty).. మొదటి నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే.. పాత్ర నచ్చితే విలన్ గా చేయడానికి కూడా అతను వెనుకాడటం లేదు. అలాగే సెకండ్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక హీరోగా చూసుకుంటే ఆది పినిశెట్టి కెరీర్లో… ‘వైశాలి’ ‘మలుపు’ వంటి సినిమాలు బాగా ఆడాయి. ముఖ్యంగా ‘వైశాలి’ సినిమా తెలుగులోనూ బాగా ఆడింది.
ఇక్కడి ఆడియన్స్ కి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.ఫేమ్ అరివళగన్ డైరెక్ట్ చేసిన సినిమా అది. ఇక దాదాపు 14 ఏళ్ల ఈ కాంబోలో ‘శబ్దం’ (Sabdham) అనే సినిమా వచ్చింది. ఇది కూడా హర్రర్ టచ్ ఉన్న సినిమానే కావడంతో.. దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ’ తెలుగులో దీనిని రిలీజ్ చేస్తున్నారు. ఒకసారి దీని బిజినెస్, బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 0.60 cr |
సీడెడ్ | 0.20 cr |
ఆంధ్ర(టోటల్) | 0.40 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.20 cr |
‘శబ్దం’ సినిమాకి తెలుగులో రూ.1.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మిగిలిన చోట్ల రెంట్ పద్ధతిలో రిలీజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది.పాజిటివ్ టాక్ కనుక వస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.