Jr NTR Fan No More: బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలా జరిగిందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కావడంతో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు పెరిగాయనే సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో తారక్ స్పీచ్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంది. అయితే ఈ ఈవెంట్ కు హాజరైన తారక్ ఫ్యాన్ ఒకరు మరణించారని తెలుస్తోంది. ఈవెంట్ నుంచి సాయిరామ్ అనే వ్యక్తిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని సమాచారం అందుతోంది.

ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సకు కోలుకోలేక సాయిరామ్ మృతి చెందారని బోగట్టా. సాయిరామ్ మృతికి సంబంధించి వేర్వేరు కారణాలు ప్రచారంలోకి వస్తున్నాయి. మూర్ఛ వచ్చి పడిపోయాడని కొంతమంది చెబుతుంటే సాయిరామ్ కింద పడ్డాడని మరి కొందరు చెబుతున్నారు. సాయిరామ్ సన్నిహితులు సైతం ఏం జరిగిందో తమకు కూడా తెలియదని సాయిరామ్ మృతికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడిస్తున్నారు.

బింబిసార ఈవెంట్ నిర్వాహకులు ఈ ఘటన గురించి స్పందించి వివరణ ఇవ్వాల్సి ఉంది. మరణించిన అభిమాని సాయిరామ్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని బోగట్టా. ఆగష్టు నెల 5వ తేదీన బింబిసార మూవీ థియేటర్లలో విడుదల కానుంది. దిల్ రాజు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు దక్కాయని సమాచారం అందుతోంది.

40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించగా విడుదలకు ముందే ఈ సినిమాకు భారీ మొత్తంలో లాభాలు వచ్చాయని తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బాలయ్య అఖండ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్లు ఖాతాలో వేసుకోగా కళ్యాణ్ రామ్ కూడా బింబిసార సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus