బుల్లితెర పై కూడా కెరీర్ బెస్ట్ సాధించిన సాయి తేజ్…!

గతేడాది ‘చిత్రలహరి’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న సాయి తేజ్ … ఏడాది చివర్లో ‘ప్రతీరోజూ పండగే’ చిత్రంతో డబుల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం సాయి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఆతని కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన చిత్రం కూడా ఇదే..!

ఫుల్ రన్ లో ఈ చిత్రం 34 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రాన్ని ఇటీవల టీవీల్లో టెలికాస్ట్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఇళ్ళలోనే ఉండిపోవడం .. అందులోనూ ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి బాగా ప్లస్ అయ్యింది. ఇటీవల ‘స్టార్ మా’ ఛానల్ లో టెలికాస్ట్ చెయ్యగా… రికార్డు స్థాయిలో 15.3 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.

ఇది సాయి తేజ్ కెరీర్లో హైయెస్ట్ అని చెప్పాలి. అంతకు ముందు సాయి తేజ్- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘సుప్రీమ్’ చిత్రం 14.69 టి.ఆర్. పి రేటింగ్ ను నమోదు చేసింది. మొత్తానికి బుల్లితెర పై కూడా తన కెరీర్ బెస్ట్ సాధించి.. మరో హిట్ ను సాధించాడు సాయి తేజ్.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus