Sai Dharam Tej: ఆ ఒక్క నిర్ణయం వల్లే సాయితేజ్ ఖాతాలో రికార్డ్ మిస్ అవుతోందా?

ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్, కృతిశెట్టి పాత్రలను బుచ్చిబాబు అద్భుతంగా చూపించడం ఈ సినిమా సక్సెస్ కు కారణమని చెప్పవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాతలకు ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది. ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ కు ఆ స్థాయి సక్సెస్ దక్కలేదనే సంగతి తెలిసిందే. అయితే విరూపాక్ష సినిమాతో సాయితేజ్ కూడా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటాడని భావించగా ఈ ఆదివారం నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుండటంతో ఈ సినిమా కలెక్షన్లకు బ్రేక్ పడినట్టేనని చెప్పుకొచ్చారు. విరూపాక్ష సినిమా కలెక్షన్లకు బ్రేక్ పడే అవకాశం సాయితేజ్ అభిమానులు సైతం ఒకింత ఫీలవుతున్నారు. సాయితేజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాయితేజ్ రెమ్యునరేషన్ కూడా పెరిగిందని 10 కోట్ల రూపాయల నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ఉందని సమాచారం అందుతోంది.

పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో బ్రో అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ మూవీ సాయితేజ్ కు మరో విజయాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయితేజ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో మెగా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. 2023 సంవత్సరం మెగా హీరోలకు కలిసిరావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో సాయితేజ్ ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

సాయితేజ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. సాయితేజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సాయితేజ్ వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిన్నచిన్న తప్పుల వల్ల వైష్ణవ్ తేజ్ సాధించిన 100 కోట్ల రూపాయల కలెక్షన్ల టార్గెట్ ను సాయితేజ్ సాధించలేకపోతున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus