Sai Dharam Tej: మెగా మేనల్లుడి సినిమా కూడా అదే రూట్లో?

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన ‘రాధే’ చిత్రం ఇటీవల ఓటిటిలో పే ప‌ప‌ర్ పద్ధతిలో విడుదలయ్యింది. సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ ఓవరాల్ గా రూ.350 కోట్ల వరకు వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ పండితుల అంచనా. ‘రాధే’ డిజిటల్ రైట్స్ ను రూ.125 కోట్లు చెల్లించి జీ వారు దక్కించుకున్నారు. అనుకూలంగా ఉన్న చోట్ల థియేట్రికల్ రిలీజ్ కూడా చేశారు.డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు రావడం అంటే మామూలు విషయం కాదు.

హీరోకి ఉన్న మార్కెట్ ను బట్టి డిజిటల్ రిలీజ్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని ‘రాధే’ ప్రూవ్ చేసింది. ఇక ఆ చిత్రం స్ఫూర్తితో ఇప్పుడు తెలుగులో మరిన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అందులో మెగా మేనల్లుడు సాయి తేజ్ మూవీ కూడా ఉందనేది తాజా సమాచారం. సాయి తేజ్ న‌టించిన తాజా చిత్రం ‘రిప‌బ్లిక్’ ను పే ప‌ర్ వ్యూవ్ పద్దతిలో డిజిటల్ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారట మేకర్స్.దీని డిజిటల్ రైట్స్ ను కూడా జీ వారే కొనుగోలు చేశారు.

‘రాధే’ విషయంలో ఎలాంటి విధానాన్ని ఫాలో అయ్యారో.. సరిగ్గా అలాగే ‘రిపబ్లిక్’ కు కూడా ఫాలో కాబోతున్నారట. అయితే ఎంతకు అమ్మారు? ఎంత రాబట్టాలి? అనే విషయాలు తెలియాల్సి ఉంది. నిజానికి ‘రాధే’ కంటే ముందు సాయి తేజ్ ‘సోలో బ్రతుకు’ చిత్రాన్ని పే పెర్ వ్యూ పద్ధతిలో విడుదల చేయాలని జీ వారు ప్రయత్నించారు. కానీ థియేటర్లలో విడుదల చేయడానికి అనూకూల వాతావరణం ఉండడంతో ఆ స్టెప్ తీసుకున్నారు దర్శకనిర్మాతలు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus