Sai Dharam Tej: ఫోన్ లో సాయిధరమ్ తేజ్ ఎక్కువగా ఏమి చూస్తారంటే..!

మెగాస్టార్ మేనల్లుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..తన టాలెంట్ తో రాణిస్తూ స్టార్‌ హీరోగా ఎదిగిపోయాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఇప్పటి వరకు కెరీర్లో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే, గతేడాది యాక్సిడెంట్‌కు గురై చావంచుల్లో దాక వెళ్లి వచ్చాడు… ఈ మెగా హీరో కెరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. కానీ విరూపాక్షతో గ్రాండ్ గా కమ్ బ్యాక్ ఇచ్చాడు.. వంద కోట్ల సినిమాతో తన టాలెంట్ తగ్గలేదని నిరూపించుకున్నాడు.

ఇటీవలే తన మేనమామతో కలిసి బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా సినిమాకి తన నటనలో ఎప్పటికప్పుడు వేరియేషన్స్ చూపిస్తూ డిఫరెంట్ జోనర్ లో సినిమాలను ఎంపిక చేసుకుంటూ వచ్చాడు . అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సాయిధరమ్ తేజ్ ఎప్పుడైనా తనకు మూడ్ అప్ సెట్ అయినా లేదా ఏదైనా బాధలో ఉన్నపుడు తాను ఏం చేస్తాడో వెల్లడించాడు.

షూటింగ్ కి వెళ్లాల్సిన సమయం లో ఇంట్రెస్ట్ లేకపోతే (Sai Dharam Tej) సాయి ధరమ్ తేజ్ వెంటనే మొబైల్ తీసుకొని కామెడీ వీడియోలు మూడ్ వచ్చేంత వరకు చూస్తారట. నిజానికి సాయి ధరమ్ తేజ్ కు మొదటి నుంచి కామెడీ జోనర్ అంటే చాలా ఇష్టమట. అవి చూడగానే తన మూడ్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుందట.

ఇప్పటికే చాలా సినిమా షూటింగ్ లలో ఆయన మనసు బాధగా ఉన్నప్పుడు లేదా షూటింగ్లో ఆయనకు ఏదైనా నచ్చకపోయిన సిచ్యువేషన్ వస్తే .. వెంటనే మొబైల్ తీసుకుని కామెడీ సీన్స్ ని ఉంటారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus