Sai Dharam Tej: పవన్ గురించి సాయితేజ్ ఏమన్నారంటే?

మెగా హీరో సాయితేజ్ ప్రతిరోజు పండగే సక్సెస్ తరువాత రిపబ్లిక్ మూవీలో నటిస్తుండగా త్వరలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్లతో సాయితేజ్ ముచ్చటిస్తూ కీలక విషయాలను వెల్లడించారు. తనకు ఈ భూప్రపంచంలో ఇష్టమైన వ్యక్తి అమ్మ అని సాయితేజ్ అన్నారు. నాన్నతో ఒక ఫోటో అని నెటిజన్ అడగగా అమ్మతో ఉన్న ఫోటోను షేర్ చేసి నాకు నాన్న కూడా అమ్మేనని సాయితేజ్ చెప్పుకొచ్చారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తనకు స్పూర్తి అని అన్నం, ఆవకాయ్, నెయ్యి, అప్పడాలు, పప్పు తన ఫేవరెట్ ఫుడ్ అని సాయితేజ్ చెప్పుకొచ్చారు. 75 లక్షల కోట్ల రూపాయలు ఇస్తామని చెబితే ద్వీపంలో ఒంటరిగా ఉంటారా..? అని నెటిజన్ ప్రశ్నించగా డబ్బును సంపాదించడానికి కష్టపడతానని డబ్బు కోసం చచ్చిపోవడం కంటే జీవించడానికే తాను ఓటు వేస్తానని సాయితేజ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత జనరేషన్ హీరోయిన్లలో ఫేవరెట్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు తనకు ఫేవరెట్ హీరోయిన్ ఎప్పటికీ సమంతేనని సాయితేజ్ చెప్పుకొచ్చారు.

చరిత్రలోకి వెళితే తనకు భగత్ సింగ్ పాత్రలో నటించాలని ఉందని సాయితేజ్ అన్నారు. టోక్నో ఘాల్ తాను చివరిగా చూసిన సిరీస్ అని హైకూ చూడటం ప్రారంభిస్తున్నానని సాయితేజ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే తన గురువు అని సాయితేజ్ అన్నారు. రామ్ చరణ్ సూపర్ మ్యాన్ అని వరుణ్ తేజ్ బ్యాట్ మేన్ అని నిహారిక మా ఇంటి బంగారమని సాయితేజ్ చెప్పుకొచ్చారు. నాగబాబు తనకు నవ్వడం నేర్పించారని అల్లు అర్జున్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని సాయితేజ్ వెల్లడించారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus