Sai Dharam Tej: చేతబడులు నేపథ్యంలో సాయి తేజ్ కొత్త సినిమా.. పోస్టర్ వైరల్?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎన్నో అద్భుతమైన చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు.అయితే ఈయన నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలకు ముందు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ నుంచి సాయితేజ్ పూర్తిగా ఇంటికే పరిమితం అయి విశ్రాంతి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నటువంటి తన 15 వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరికొత్త లుక్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ చిత్రబృందం అధికారకంగా ప్రకటించడంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ సినిమాకు ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చేతబడి నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని సమాచారం. చేతబడికి బలవుతూ అనుమానాస్పదంగా మరణిస్తున్న ఒక గ్రామానికి ముంబై నుంచి వచ్చే ఇంజనీర్ పాత్రలో సాయిధరమ్ తేజ్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని సాయి తేజ్ ఎలా చేదిస్తారు అనే కోణంలో ఈ సినిమా కొనసాగుతుందని తెలుస్తోంది. ఇకపోతే కార్తీక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు.ఈ సినిమా కథ స్క్రీన్ ప్లే కూడా సుకుమార్ అందించనున్నారు.వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ రైటింగ్స్‌ తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకి సుకుమార్ కథస్కీన్ ప్లే అందిస్తున్నారని తెలియడంతో మొదటి పోస్టర్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రిపబ్లిక్ సినిమాతో మిశ్రమ స్పందన అందుకున్న సాయితేజ్ తిరిగి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో తెలియాల్సి ఉంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus