Sai Dharam Tej: సుక్కూ స్క్రీన్ ప్లేతో సాయితేజ్ సక్సెస్ సాధిస్తారా?

మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా తన టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో సాయితేజ్ ఒకరు. ప్రతిరోజూ పండగే సక్సెస్ తర్వాత సాయితేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్ సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి. యాక్సిడెంట్ వల్ల మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న సాయితేజ్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇప్పటివరకు యూత్ కు నచ్చే కథలలో ఎక్కువగా నటించిన సాయితేజ్ ప్రస్తుతం వినోదాయ సిత్తం రీమేక్ తో పాటు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు.

సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాకు డైరెక్టర్ కాగా సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించడం గమనార్హం. సుకుమార్ శిష్యులలో చాలామంది ఇప్పటికే ఇండస్ట్రీలో దర్శకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన సినిమాలు సైతం కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. సాయితేజ్ కార్తీక్ కాంబో మూవీకి రుద్రవనం అనే టైటిల్ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఒక ఊరిలో ఎవరికీ అంతు చిక్కని విధంగా ఆత్మహత్యలు, హత్యలు జరుగుతుంటాయని వాటిని హీరో ఏ విధంగా చేధించాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని బోగట్టా. సుకుమార్, బీ.వీ.ఎస్.ఎన్. ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సాయితేజ్ వినోదాయ సిత్తం రీమేక్ లో కూడా నటిస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.

త్వరలో ఈ సినిమా నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. సాయితేజ్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయితేజ్ నటిస్తున్న సినిమా కథ కొత్త కథ కాకపోయినా సుకుమార్ స్క్రీన్ ప్లే కావడంతో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. సాయితేజ్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus