యువ హీరోలకి ప్రేమ కథలకి మించింది లేదు. లో బడ్జెట్.. సేఫ్ గేమ్. మధ్యలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు మిక్స్ చేస్తే మాస్ ఆడియన్స్ కి మసాలా దొరికినట్టే. అదిరే స్టెప్పులు వేయగలిగితే విజిల్స్ బోనస్. అలాగే మన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి సినిమాల్లో కొంచెం ప్రేమ .. కొంచెం యాక్షన్.. క్లైమాక్స్ లో సెంటిమెంట్ తో బండి లాగించేసాడు. ఆ తర్వాత యాక్షన్ డోస్ పెంచేసరికి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాడు. అందుకే ఈసారి కేవలం ప్రేమ.. చివర్లో సెంటిమెంట్ అనే ఫార్ములాతో వస్తున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ చేసిన తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాలకు ఒకే చెప్పాడు.
అయితే తేజ్ మూవీ హిట్ అయితే మాత్రం ప్రయోగం చేయాలనీ ఫిక్స్ అయ్యారంట. అందుకే విభిన్నమైన కథని ఎంచుకున్నట్లు తెలిసింది. వర్షం , నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్ చిత్రాలకు రైటర్ గా పనిచేసిన వీరుపోట్ల, బిందాస్ సినిమాతో డైరెక్టర్ మారి హిట్ కొట్టాడు. ఆ తర్వాత రగడ, దూసుకెళ్తా వంటి హిట్లు అందుకున్న వీరు తాజాగా తేజు కు శ్రీ కృష్ణదేవరాయలు కాలం నాటి కథ ను వినిపించారంట. ఆ స్టోరీ తేజకు బాగా నచ్చడం తో వెంటనే ఓకే చెప్పారని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో వీరుపోట్ల బిజీ గా ఉన్నారు. మరి ప్రాజక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.