‘చిత్ర లహరి’ తో తేజు హిట్టు కొడతాడా..?
- December 13, 2018 / 11:37 AM ISTByFilmy Focus
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ దాదాపు అరడజన్ ప్లాపుల తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘చిత్ర లహరి’. ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నాడంట తేజు. దీని కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. ఇప్పటికే తన లుక్ ను పూర్తిగా మార్చి కొత్తగా కనిపిస్తున్నాడు.
‘సెకండ్ హ్యాండ్’ ‘నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగీ’ వంటి చిత్రాలు తెరకెక్కించిన కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘మెంటల్ మదిలో’ ఫేమ్ నివేదా పేతురాజ్, ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి 2019 సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















