Sai Dharam Tej: విరూపాక్ష సీక్వెల్ పై స్పందించిన సాయి తేజ్

మెగా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఒకరు. మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా 2014 నవంబర్ 14 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలా ఈయన సినిమా ద్వార ఇండస్ట్రీలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావడంతో సరదాగా అభిమానులతో కలిసి చిట్ చాట్ చేశారు.

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా నేటిజన్స్ అడిగే ప్రశ్నలన్నింటికీ కూడా ఈయన సమాధానం చెబుతూ వచ్చారు.. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్స్ ఈయన సినిమాల గురించి ప్రశ్నించగా మరికొందరు సరదాగా ఈయనతో ప్రశ్నలు వేశారు. అయితే ఒక నెటిజన్ మాత్రం ఏకంగా అన్న అర్జెంటుగా 10 లక్షలు కావాలి అంటూ ప్రశ్న వేయడంతో వెంటనే రియాక్ట్ అయినటువంటి సాయి ధరంతేజ్ బ్రహ్మానందం నవ్వుతూ కనిపించే జిఫ్ ఇమేజ్ పోస్ట్ చేశారు.

మరొక నెటిజన్ పెళ్లెప్పుడు బ్రో అంటూ ప్రశ్నించగా నీ పెళ్లి జరిగిన వెంటనే అంటూ సరదాగా సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతారు అంటూ ప్రశ్నించడంతో గురువుగారు అంటూ సాయి తేజ్ చెప్పిన సమాధానం అందరిని ఆకట్టుకుంటుంది. ఇక మరొక నెటిజన్ విరూపాక్ష సీక్వెల్ సినిమా గురించి ప్రశ్నించారు.

విరూపాక్ష సినిమాలో (Sai Dharam Tej) సాయిధరమ్ తేజ్ నటించగా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం రాబోతుంది అంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నెటిజన్ విరూపాక్ష 2 ఎప్పుడు రాబోతుంది అంటూ ప్రశ్నించడంతో ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ.. ఆ విషయం శాసనాల గ్రంథం చూసి చెప్పాలి అంటూ చెప్పిన సమాధానం వైరల్ అవుతుంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus