Sai Tej: మా కుటుంబం మొత్తం రుణపడి ఉన్నాం!

  • April 28, 2023 / 03:25 PM IST

సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో తనని కాపాడినటువంటి సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్ గత రెండు రోజుల క్రితం చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి ధరంతేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో తనని చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. అయితే సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకురావడం వల్ల సాయి తేజ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇలా సాయి ధరమ్ తేజ్ ను కాపాడటంతో సయ్యద్ భారీగా లబ్ది పొంది ఉంటారని అందరూ భావించారు.

ఇక విరూపాక్ష సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సయ్యద్ ను తాను కలిసి తన ఫోన్ నెంబర్ ఇచ్చానని తన మానవత్వాన్ని డబ్బుతో విలువ కట్టలేదని అందుకే ఏ సహాయం అవసరమైన తనకు ఫోన్ చేయమని తన ఫోన్ నెంబర్ ఇచ్చాను అంటూ సాయి ధరమ్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో మీడియా సయ్యద్ ను సంప్రదించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి డబ్బు అందలేదు పైగా తనకు డబ్బు అందిందని వార్తలు రావడంతో ఉన్న ఉద్యోగం కూడా పోయి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. సయ్యద్ ఇలా చెప్పడంతో సాయిధరమ్ తేజ్ ను భారీగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ వివాదం పై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా (Sai Tej) సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ తనపై తన టీం పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు.

తాను సయ్యద్ ను కలిశానని తనకు నా నెంబర్ ఇచ్చానని తాను ఎక్కడ చెప్పలేదని తెలిపారు. ఇక సయ్యద్ వివరాలని తన వద్ద ఉన్నాయని అయితే ఆయనకు ఎప్పుడు ఏమి అవసరం వచ్చిన తన మేనేజర్ ద్వారా సంప్రదించవచ్చని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. ఇక నేను డబ్బులు ఇచ్చానని ఎక్కడ చెప్పలేదు అయితే మా కుటుంబం మొత్తం రుణపడి ఉన్నామని,ఈ కాంట్రవర్సీపై ఇదే తన చివరి స్పందన అంటూ ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus